Share News

MP Aravind : కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది.. ఎంపీ అరవింద్ ఫైర్

ABN , Publish Date - Sep 30 , 2024 | 02:07 PM

తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు.హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

MP Aravind :  కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది.. ఎంపీ అరవింద్  ఫైర్

నిజామాబాద్: కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత అయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇవాళ(సోమవారం) ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


ALSO READ: CPI Narayana: వన్ నేషన్ పేరిట హక్కులను కాలరాస్తున్న కేంద్రం

అందుకే ఇక్కడ పేదల ఇళ్లను కూలుస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామన్నారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు. హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు.. రైతు భరోసా లేదు.. బోనస్ ముచ్చటే లేదని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేరని ఎంపీ అరవింద్ అన్నారు.


ALSO READ: Harish Rao: హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు.. హరీష్‌రావు ధ్వజం

కేసీఆర్.. ఒక ఎకరాకు కోటి సంపాదిస్తున్నాడట.. కోటి సంపాదన ఎలా సాధ్యమో తెలుసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఒక టీమ్‌ను ఆయన ఫాంహౌస్‌కు కూడా పంపాలని కోరారు. పరిశీలించడానికి రేవంత్ టీంను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు గైడ్ చేయాలని సూచించారు. కేసీఆర్ దిగిపోయాక ఆయన మాటలను చాలా మిస్ అవుతున్నానని అన్నారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారు.. ఇప్పుడు పిల్లి లాగా అయ్యారని ఎంపీ అరవింద్ విమర్శలు చేశారు. కేసీఆర్.. తెలంగాణను నట్టేటా ముంచారని ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు.


ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ పాలసీ ఎందుకు తీసుకురాలేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అల్లం, పసుపుకు తేడా తెలియదని.. ఆయన కూడా ఈరోజు మాట్లాడుతున్నారని ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌లాగే వరి మాత్రమే వేసుకునే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. రేవంత్ ప్రభుత్వంలో రైతు భరోసా కాదు.. బీమా కూడా అందట్లేదని ఎంపీ అరవింద్ ఆరోపించారు.


ALSO READ: KTR: పంచాయతీల్లో పాలన గాడి తప్పింది.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విసుర్లు

మాజీ ప్రధాని ఇందిరమ్మను కూడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇంకా బదనాం చేస్తున్నారని అన్నారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రారంభిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే.. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరారు. కేసీఆర్‌ను ఆయన ఫ్యామిలీని చూసి ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ ఓటు వేయరని అన్నారు. బీజేపీ నేతలు అంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మనదేనని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: 1962 సేవల పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఫైర్

ED: ఈడీ అదుపులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2024 | 02:35 PM