Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా పాలమూరు పథకం వెంటనే పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 24 , 2024 | 08:01 PM
పదినెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇప్పటికైనా మిగిలిపోయిన ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
హైదరాబాద్: పదినెలల తర్వాత పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇప్పటికైనా మిగిలిపోయిన ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 90శాతం ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలోనే జరిగాయని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
ALSO READ: Adi Srinivas: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో..సుద్దపూస ముచ్చట్లు ఆపు
వలసల పాలమూరు జిల్లాను మాజీ సీఎం కేసీఆర్ పచ్చబడేలా చేశారని చెప్పారు. పాలమూరులో లక్షల ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. తాము పిలిచిన టెండర్లు కొనసాగించి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఇప్పటికే పూర్తయ్యేదని అన్నారు. గతంలో అభివృద్ధిలో వెనుకబడ్డ పాలమూరును చూయించి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చేవారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా పాలమూరు పథకం వెంటనే పూర్తి చేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.
ALSO READ: KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ కూడా పాలమూరు రంగారెడ్డిలో పనులు చేసిందని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. పాలమూరు ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న మంత్రులు.. ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. మంత్రుల పర్యటన పాలమూరు రైతులకు భరోసా ఇచ్చేదిగా ఉండాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారేనని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పురోగతి జూపల్లికి తెలుసునని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ బృందం తమిళనాడు వెళ్తుందని శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ కామెంట్స్..
Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..
V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన
BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ
Read Latest Telangana News and Telugu News