Home » Kerala
గల్ఫ్ దేశం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చికి చేరుకుంది. మృతుల్లో 23 మంది కేరళ వారే ఉండటంతో కువైట్ నుంచి నేరుగా కొచ్చికే విమానం బయలుదేరింది. అప్పటికే మృతుల కుటుంబీకులు కొచ్చి విమానాశ్రయానికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఆ స్థానానికి ఇవాళో, రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం(Kuwait building fire accident)లో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి(IAF) చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ(kerala) చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. విమానంలో కీర్తి వర్ధన్ సింగ్ బయలుదేరి వచ్చారు.
ప్లస్ టు లో కూతురికి మంచి మార్కులు వచ్చాయి. ఇంటికి వచ్చి నర్సింగ్ కోర్సులో చేర్పించాలని అనుకున్నాడు. పై చదువు చదివే బిడ్డకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. వచ్చే నెలలో కేరళ రావాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో విధి వక్రీకరించింది. ఆ ఇంటి పెద్దను బలి తీసుకుంది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గణనీయమైన సీట్లు సాధించడంతో జోష్ మీదున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయన యూపీలోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు లోక్ సభ స్థానాల నుంచి రాహుల్ ఘన విజయం సాధించారు.
కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపికి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఆదివారంనాడు చోటు దక్కింది. అయితే, కొత్త బాధ్యతల నుంచి తనను రిలీవ్ చేయాలని సురేష్ గోపి కోరుకుంటున్నట్టు మీడియోలో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలపై సురేష్ గోపి తోసిపుచ్చారు. మోదీ మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వ భావనను బలంగా నాటేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠ్యపుస్తకాల్లో లింగ సమానత్వాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి కేరళలో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన పాఠ్యపుస్తకాల్లో వంట, ఇతర ఇంటి పనుల్లో లింగ భేదానికి తావులేకుండా కుటుంబ సభ్యులంతా కలిసి అన్నిపనులూ చేస్తున్న చిత్రం అందరినీ విశేషంగా ఆకర్షించింది.
‘స్పైడర్‌మ్యాన్’ సినిమాల్లో.. ప్రమాదంలో ఉన్న ప్రజలను హీరో ఎలా కాపాడుతాడో అందరూ చూసే ఉంటారు. ఎక్కడి నుంచో ఊడిపడి.. రెప్పపాటులో చనిపోబోయే వ్యక్తుల్ని రక్షిస్తాడు.
విమానంలో ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.
కేరళకు చెందిన ఓ వ్యక్తి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హల్చల్ చేశాడు. తోటి ప్రయాణికులను, క్యాబిన్ సిబ్బందిని హడలెత్తించాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. భయపడిన సిబ్బంది విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.