Home » Kerala
తామిచ్చిన హామీలను నెరవేర్చని రాజకీయ పార్టీలు (Political Parties) అప్పుడప్పుడు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటాయి. నాయకులు కనిపించినప్పుడు వారిని అడ్డుకొని హామీలు పూర్తి చేయమని నిలదీయడమో, మరోసారి ఓటు అడిగేందుకు తమ ప్రాంతంలో అడుగుపెట్టొద్దని హెచ్చరించడమో వంటివి చోటు చేసుకుంటాయి. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా కేరళలోని (Kerala) ఓ గ్రామం కూడా అదే పంతానికి దిగొచ్చింది.
'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
కేరళలోని పాలక్కడ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( PM Modi ) బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల (2024 Lok Sabha Elections) తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) (Election Commission Of India) శనివారం (16/03/24) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయని.. తొలి దశ ఎన్నికల ఏప్రిల్ 19వ తేదీ నిర్వహించనుండగా, ఏడో దశ ఎన్నికలు జూన్ 1వ తారీఖున ఉంటాయని ఈసీఐ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (ECI Chief Commissioner Rajiv Kumar) వెల్లడించారు.
ఈసారి కూడా మోదీ ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటివల ప్రజలకు చేరువ కావడానికి ఆన్లైన్, ఆఫ్లైన్ మాధ్యమాలను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివల పంపించిన వాట్సాప్ సందేశాలు వివాదాస్పదంగా మారాయి.
దేశంలో ఇటివల పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ అంశంపై స్పందించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వారి మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని జాబితాలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రాహుల్ అమేథీ నుంచి కూడా పోటీ చేస్తారనే చర్చ మొదలైంది.
రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి మేథస్సు నుంచి పుట్టిన అనేక ఆవిష్కరణలు.. మనుషులే ఆశ్చర్యపడేలా పని చేయడం చూస్తూ ఉన్నాం. ఇటీవల టెక్నాలజీ రంగంలో ఏఐ.. పెనుమార్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ టెక్నాలజీతో...
దక్షిణ భారత్ మినహా అంతటా పట్టు నిలుపుకుంటున్న బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన విషయం విదితమే. 195 మంది అభ్యర్థులతో ఈ లిస్టు విడుదలైంది.
ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ఉంటుంది. అయితే సందర్భానుసారం అది బయటపడుతుంటుంది. అలాంటప్పుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజగా..