Share News

Mohanlal: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్‌లాల్

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:36 PM

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు మోహన్ లాల్.. ఆదివారం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతోపాటు కండరాల నొప్పులతో ఆయన బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్‌తో ఆయన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

Mohanlal: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోహన్‌లాల్

తిరువనంతపురం, ఆగస్ట్ 18: ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆదివారం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆయన చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతోపాటు కండరాల నొప్పులతో మోహన్ లాల్ బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఈ సందర్భంగా వెల్లడించాయి.

Also Read: J&K Assembly polls: కిషన్‌రెడ్డి అధ్యక్షతన నేడు కీలక భేటీ

అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేశాయి. వైరల్ ఫీవర్‌తో ఆయన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాయి. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు సూచించారు. ఈ మేరకు ఇండస్ట్రీ ట్రాకర్ శ్రీధర్ పిళ్లై.. తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. మరోవైపు మోహన్ లాల్ నటించి తాజా చిత్రం బరోజ్. ఈ చిత్రం ఈ ఏడాది ఆక్టోబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


జులైలో వయనాడ్‌‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. దీంతో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో.. వందలాది మంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారంతా వివిధ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అలాంటి వేళ.. భారత సైన్యంతో కలిసి మోహన్ లాల్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే వయనాడ్‌లో విపత్తు నేపథ్యంలో.. సహాయ పునరావాస చర్యల కోసం రూ. 3 కోట్ల ఆర్థిక సాయాన్ని నటుడు మోహన్ లాల్ ప్రకటించారు.


ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాను మోహన్ లాల్‌కు భారత సైన్యం కేటాయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో భారత సైన్యంతో కలిసి ఆయన వయనాడ్ జిల్లాలో పునారావాస చర్యల్లో పొల్గొన్నారు. దీంతో కేరళకు చెందిన ఓ యూట్యూబర్.. మోహన్ లాల్‌పై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు.


దాంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు 2015లో మోహన్ లాల్.. తన తల్లిదండ్రులు విశ్వనాథన్, శాంత కుమారి పేరుల మీద విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయక చర్యలను మోహన్ లాల్ చేపట్టిన. చేపడుతున్న సంగతి తెలిసిందే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 03:46 PM