Home » Khammam News
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జాతీయ ఉపాధి పథకంలో వెలుగు చూసిన అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఉపాధి కూలీలుగా చూపుతూ వారి ఖాతాల్లో నగదు బదిలీ చేసిన వ్యవహారంలో ఓ ఫీల్డ్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు పడింది.
ఖమ్మంలో ఈ నెల 9 నుంచి 11 వరకు రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ‘నెలనెల వెన్నెల’, ఖమ్మం కళాపరిషత్, ప్రజానాట్యమండలి కళాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నాటిక పోటీలు జరగనున్నాయి.
తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు.
వైద్యం కోసం ఖమ్మం వచ్చి.. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా అనూహ్యంగా దూసుకొచ్చిన కారు వారిపాలిట మృత్యుశకటమైంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జగన్నాథపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
రఘునాథపాలెం మండలం హరియాతండా వద్ద మృతిచెందిన ముగ్గురి అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. మే 28న జరిగిన రోడ్డుప్రమాదంపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడని విచారణలో తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది.
విజయవాడ యార్డ్ పరిధిలో మరమ్మతుల కారణంగా పినాకిని, జనశతాబ్ధి రైళ్లను(Pinakini, Janashtabdi trains) రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు మంగళవారం పదిమందిపై కేసు నమోదు చేశారు.
చింతకాని మండలం పొద్దుటూరు (Podhuturu) గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్(Bojedla Prabhakar) ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister) తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు.