Share News

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN , Publish Date - Sep 08 , 2024 | 12:39 PM

మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.

Kishan Reddy: వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఖమ్మం: మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు. వీధుల్లో తిరుగుతూ అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించి బాధితులను ఓదార్చారు. నిత్యావసరాల పంపిణీ, పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు. కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.."ప్రకృతి వైపరిత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1,300 కోట్లు పంపింది. వరదపై రాజకీయం చేయడం సరికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్నేరు వరద బాధితులకు అండగా ఉంటాయి. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తాం. వర్షాలకు సర్వం కోల్పోయిన వారిని చూస్తుంటే బాధేస్తోంది. రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర బృందాలు పర్యటించి పంట, పశుసంపద నష్టంపై అంచనాలు తయారు చేస్తారు. అనంతరం బాధితులకు వికాస్ మేనేజ్మెంట్ కింద సహాయం చేస్తాం" అని చెప్పారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇలాంటి సమయాల్లో పార్టీలన్నీ ప్రజలకు సేవ చేసేందుకు కలిసి ముందుకు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజలకు సేవ చేయడం పక్కనపెట్టి రాజకీయ విమర్శలు చేయడం సరికాదని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాయని మంత్రి హామీ ఇచ్చారు. బ్యాంకులు తెరిచిన వెంటనే తక్షణ సాయం కింద మున్నేరు వరద బాధితుల అకౌంట్లో నగదు వేస్తామని మంత్రి శ్రీనివాస రెడ్డి చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Deepthi Jeevanji: పారా అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

HYDRA: అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం.. అమీన్‌పూర్‌లో వైసీపీ నేత ఆక్రమణల కూల్చివేత

Murali Mohan: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్..

Updated Date - Sep 08 , 2024 | 12:55 PM