Share News

Minister Pongulet: విపత్కర సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం

ABN , Publish Date - Sep 08 , 2024 | 03:56 PM

ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.

Minister Pongulet: విపత్కర  సమయంలో  రాజకీయాలు ముఖ్యం కాదు.. ప్రజలను కాపాడటమే ముఖ్యం

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అయితే ఈరోజు (ఆదివారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించి బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.... ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదని.. ప్రజలను కాపాడటమే ముఖ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తిర్మలాయపాలెం మండలం రాకాసి తండాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...


తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా జిల్లాలు జలమయమయ్యాయని చెప్పారు. వరదలకు నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి, ఈరోజు కిషన్ రెడ్డి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు.


కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్ రెడ్డి సెక్రటరీకి వరద సాయంపై కీలక ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి పొంగులేటి కోరారు. ఈ సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడటమే ముఖ్యమని.. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇస్తోందని వివరించారు. తెలంగాణ అంటే గతంలో లాగా ధనిక రాష్ట్రం కాదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తెలియజేశామని చెప్పారు.


విపత్తు మొదలైన రోజే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ శవాల మీద చిల్లర ఏరుకుంటోందని విమర్శలు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షం ప్రజలను ఆదుకోకుండా కూడా రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు.


Hydra: వాళ్లందరికీ హైడ్రా గుడ్ న్యూస్.. ఆక్రమణలు తొలగించబోమని ప్రకటన..

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఊహించని విరాళం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 08 , 2024 | 04:13 PM