Home » KL Rahul
గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాహుల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది.
స్టార్ ఆటగాళ్లు వరుసగా జట్టుకు దూరమవుతున్న వేళ నిరాశలో ఉన్న టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది.
తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్.
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు భారత్ ఆధీక్యం కొనసాగింది. తొలి రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ అధిక్యం దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్‌పై భారత జట్టు 63 పరుగుల అధిక్యంలో నిలిచింది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. లంచ్ విరామ సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయాస్ అయ్యర్ (34) ఉన్నారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా టీమిండియా ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.
Sunil Gavaskar: టీ20 ప్రపంచకప్‌నకు మరో 6 నెలల సమయం కూడా లేదు. దీంతో జట్లన్నీ ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రపంచకప్‌నకు తమ జట్లను సిద్దం చేసుకోవడంపై సెలెక్టర్లు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌నకు టీమిండియా ఎలాంటి జట్టుతో వెళ్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.