KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ వార్నింగ్.. చెప్పింది చెయ్ అంటూ..
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:56 PM
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. చెప్పింది చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ బోర్డు చాలా విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ఆటగాళ్ల విషయంలో కాస్త చూసీ చూడనట్లు ఉండేది. కానీ ఇప్పుడు బీసీసీఐ పెద్దలు ప్రతి విషయంలో కచ్చితత్వంతో ఉంటున్నారు. తమ మాట వినని ఆటగాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తమను కాదని ఓవరాక్షన్ చేసిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ మీద బోర్డు బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బీసీసీఐ ఏం చెబితే అదే వింటున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు బోర్డు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారంది. అసలు ఏం జరిగింది? రాహుల్‌ను బోర్డు హెచ్చరించడానికి గల కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
నో రెస్ట్!
ఇటీవల వరుస క్రికెట్‌తో అలసిపోయాడు కేఎల్ రాహుల్. డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు బంగ్లాదేశ్ సిరీస్, న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా టూర్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ మ్యాచులతో బిజీ అయిపోయాడు. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. స్వదేశానికి వచ్చాక రెస్ట్ మోడ్‌లోకి వెళ్లాలని అనుకున్నాడు. దేశవాళీ టోర్నీలకు దూరంగా ఉండాలని అనుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు రెస్ట్ తీసుకొని బ్యాటింగ్ టెక్నిక్స్, ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌లోనూ ఆడొద్దని అనుకున్నాడు. అయితే అతడికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆ సిరీస్‌లో తప్పనిసరిగా ఆడాలని ఆదేశించిందట.
యూ-టర్న్!
రాహుల్‌కు తొలుత రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్లు భావించారట. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌కు అతడికి విశ్రాంతిని ఇవ్వాలని అనుకున్నారట. అయితే ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలోని ప్రతి ప్లేయర్ పూర్తి ఫిట్‌నెస్, ఫామ్‌తో ఉండాలని సెలెక్టర్లు డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే ఆ సిరీస్‌లో ఆడాలని, ప్రిపరేషన్స్ మొదలుపెట్టాలని రాహుల్‌ను ఆదేశించారట. నో రెస్ట్.. ఆడాల్సిందేనని హెచ్చరించారని సమాచారం. కాగా, అప్పట్లో డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడాలని అయ్యర్, పంత్‌ను బీసీసీఐ ఆదేశించడం, వాళ్లు మాట వినకపోవడంతో కాంట్రాక్ట్ రద్దు చేయడం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు మాట వినాలని రాహుల్ నిర్ణయించుకున్నాడని వినిపిస్తోంది.
ఇవీ చదవండి:
కెప్టెన్‌గా కోహ్లి.. ఒక్క మాటతో తేల్చేసిన హెడ్ కోచ్
జర్రుంటే సచ్చిపోతుండే.. డేవిడ్ భాయ్ అదృష్టం బాగుంది
స్వామీజీ ఆశీస్సులు.. కోహ్లీకి ఇక తిరుగులేదు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి