Home » Kodangal
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ పథకాన్ని నిర్మించనుంది.
దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం తప్ప పోలింగ్ కూల్‌గా సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో సతీ సమేతంగా ఓటు వేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌కు సోమవారం సీఎం రేవంత్ వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
CM Revanth Convoy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో (Kodangal) పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సీఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు.. సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (బుధవారం) కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ కొండగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం శంఖుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుంటే.. ఆయనను సొంత నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతలను తన అన్న తిరుపతి రెడ్డి బుజాన వేసుకున్నారు. 2018లో రేవంత్‌ను ఓడించి తొడగట్టిన బీఆర్ఎస్కు మొన్నటి ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చి మీసం మెలేసేలా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ పలు చోట్ల ఈవీఎంల(EVMs) మొరాయింపు అధికారులను టెన్షన్ పెడుతోంది. తాజాగా కొడంగల్(Kodangal) నియోజకవర్గంలో ఓ ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.