Home » Kolkata
ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ గురువారం కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి ఆర్ జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదే సమయంలో ఈరోజు సీబీఐ, బెంగాల్ పోలీసులు తమ స్టేటస్ రిపోర్టును సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. సీబీఐ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందజేశారు.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల, ఆస్పత్రిని కేంద్రబలగాలు తమ అధీనంలోకి తీసుకోనున్నాయి.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సామాన్యులే కాదు.. మనం ఎన్నుకుని చట్టసభలకు పంపించిన అనేక మంది ప్రజాప్రతినిధులపై కూడా లైంగిక ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాల కేసులు ఉన్నాయి.
కోల్‌కతా మహానగరంలో దక్షిణ శివారు ఆనందపూర్ గ్రామంలోని రహదారి పక్కన పొదల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం కోల్‌కతా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ: కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు.
ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు తొమ్మిది మంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్ (ఎన్‌టీఎ్‌ఫ)ను ఏర్పాటు చేసింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో తీవ్ర సంచలనం సృష్టించిన
మంగళవారం కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏఎస్ఐ అరుప్ దత్తా సీబీఐ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.