Home » Komati Reddy Venkat Reddy
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును అమెరికా నుంచి రావద్దని కేటీఆర్ ,హరీష్ రావు అమెరికాకు పోయి చెప్పి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ రావు వస్తే వీరు జైలుకు పోతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణకు రూ.2వేల కోట్లతో చేపట్టనున్న పనులకు త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బినామీ పేర్లతో నిర్వహిస్తున్న డెయిరీల నుంచి వచ్చే నెయ్యిని యాదాద్రి, వేములవాడ దేవాలయాల్లో లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.
మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీష్‌రావు బినామీ అని.. ఆ పేరుతో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.
ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయొచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ అండ్ బీ యంత్రాంగాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్‌కు ఈ నెల 21నేలేఖ రాశారు.
హైదరాబాద్ - విజయవాడ (ఎన్‌హెచ్- 65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని.. రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబరు నాటికి పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ జన్వాడలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కేటీఆర్ ఫామ్ హౌస్ చూసివచ్చినట్లు మంత్రి తెలిపారు.
తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళుతుందని, దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.