Share News

Minister Komati Reddy: హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:02 PM

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీష్‌రావు బినామీ అని.. ఆ పేరుతో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.

Minister Komati Reddy: హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

నల్గొండ: మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీష్‌రావు బినామీ అని.. ఆ పేరుతో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల మదర్ డైరీ ఎన్నికలు ఈరోజు(శనివారం) జరిగాయి.


ALSO READ: CP CV Anand: నిమజ్జనానికి 25వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్..

ఈ ఎన్నికల్లో గుడిపాటి మధుసూదన్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా ఎంపికైన మధుసూదన్ రెడ్డికి, ఈ ఎన్నికలో గెలిచిన ఆరుగురు డైరెక్టర్‌లకు ఎన్నికల అధికారితో కలిసి సర్టిఫికెట్‌లను మంత్రి కోమటిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో 6కు 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తెలిపారు.. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.


ALSO READ: Minister: రెచ్చగొట్టే వారిని అణిచివేయండి..

ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లకు మదర్ డైరీ పాలు సరఫరా చేయాలని... ఆ రెండు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మదర్ డైరీ పాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లను మంత్రి కోమటి రెడ్డి కోరారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మదర్ డైరీ నుంచే లడ్డూల తయారీకి అవసరమయ్యే నెయ్యిని అందజేయాలని మంత్రి కొండా సురేఖకు తెలిపారు. దీంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన పాత జీవోను వెంటనే రద్దు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.


ALSO READ: Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలకు లడ్డూల తయారీకి మదర్ డైరీ నుంచి నెయ్యి తరలింపును వెంటనే ప్రారంభించాలని మంత్రి కొండా సూరేఖను కోరారు ఇలా చేయడం ద్వారా రూ. 60 కోట్ల అప్పులో ఉన్న మదర్ డైరీ అప్పును త్వరగా తీర్చే అవకాశం ఉందని అన్నారు. బర్లు, గోర్లలోనే కాకుండా పాల ఉత్పత్తిలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మదర్ డైరీ అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

Hyderabad: వామ్మో జ్వరం.. పెరుగుతున్న వైరల్‌ ఫీవర్ల బాధితులు

Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

For MoreTelangana NewsandTelugu News..

Updated Date - Sep 14 , 2024 | 05:02 PM