Home » Konda Surekha
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. సోమవారం నాడు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు.
Telangana: ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారంపై మంత్రి కొండాసురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వెళ్తానని చెప్పుకొచ్చారు.
దేశ రక్షణలో భాగంగా వికారాబాద్ రాడార్ సెంటర్ నిర్మాణం జరిగిందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. దేశంలో రెండో కేంద్రంగా వికారాబాద్ ఉందన్నారు. ఇలాంటి కేంద్రాలు తమిళ్ నాడులో ఉన్నాయని, ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టంచేశారు.
ములుగు జిల్లా: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను వారు పరిశీలించనున్నారు.
ఏఐసీసీ అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) తెలిపారు. గురువారం నాడు మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం జరిగిందని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు ( BRS Leaders ) పదవి పోయిన ప్రస్టేషన్లో ఉన్నారని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) సెటైర్లు వేశారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRDలో సీఎం రేవంత్ చర్చించారు.
జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రి ( MGM Hospital ) ప్రక్షాళనపై దృష్టి సారించామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఎంజీఎంలో మంత్రి సురేఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎంలో వసతులు, రోగులకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... కోతుల బెడద వల్ల వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ జరిగి ఎంజీఎంలో మొన్న రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ ను పునరుద్దరించారని మంత్రి కొండా సురేఖ చెప్పారు.
ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda surekha ) తెలిపారు. ఐనవోలు జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై మంత్రి సురేఖ ఆదివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ( Palla Rajeshwar Reddy ) ప్రొటోకాల్ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Konda surekha ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లాలోని హరిత హోటల్లో కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.