Home » Lok Sabha Election 2024
జమ్మూ కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ సైనికుడు మృతి చెందాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని మోడర్గమ్ గ్రామంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి.
మోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఆగస్ట్‌లో కుప్పకూలిపోనుందని ఆయన జోస్యం చెప్పారు. దీంతో ఎన్నికలు ఏ సమయంలోనైనా మళ్లీ జరగవచ్చునన్నారు.
లోక్‌సభలో కాశ్మీరి నేత ఇంజినీర్ రషీద్, ఖలిస్థాన్ అనుకూల నాయకుడు అమృత్‌పాల్ సింగ్ సభ్యులుగా ప్రమాణం చేశారు. శుక్రవారం పార్లమెంట్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేశారు.
ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్.. జులై 5వ తేదీ అంటే శుక్రవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. నాలుగు రోజుల పెరోల్‌పై ఆయన బయటకు రానున్నారని సమాచారం. ఆ క్రమంలో లోక్‌సభ సభ్యుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారని తెలుస్తుంది.
లోక్‌సభ సమావేశాలు ఏడో రోజు ప్రారంభం కాగానే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ ఓంబిర్లా కొనసాగించారు. సోమవారం వివిధ పార్టీల ఎంపీలు మాట్లాడగా.. మిగిలిన చర్చను ఇవాళ కొనసాగించారు.
మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తనదైన శైలిలో స్పందించారు.
2014 ఎన్నికల వేళ.. స్విస్ బ్యాంక్‌లోని నల్లధనాన్ని భారత్‌కు తీసుకు వస్తానని నరేంద్ర మోదీ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల వేళ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ అంటూ అదే మోదీ ప్రచారం నిర్వహించారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంటే..
లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
ఎంపీగా ప్రమాణం చేస్తూ జై పాలస్తీన అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి నవనీత్ రాణా గురువారం లేఖ రాశారు.
తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు.