Share News

Lok Sabha Elections: ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృతపాల్..

ABN , Publish Date - Jul 03 , 2024 | 06:45 PM

ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్.. జులై 5వ తేదీ అంటే శుక్రవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. నాలుగు రోజుల పెరోల్‌పై ఆయన బయటకు రానున్నారని సమాచారం. ఆ క్రమంలో లోక్‌సభ సభ్యుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారని తెలుస్తుంది.

Lok Sabha Elections: ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృతపాల్..
Amritpal Singh

న్యూఢిల్లీ, జులై 03: ఖలిస్థాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్.. జులై 5వ తేదీ అంటే శుక్రవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయనున్నారు. నాలుగు రోజుల పెరోల్‌పై ఆయన బయటకు రానున్నారని సమాచారం. ఆ క్రమంలో లోక్‌సభ సభ్యుడిగా ఆయన ప్రమాణం చేయనున్నారని తెలుస్తుంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. నిషేధిత వారీస్ పంజాబ్ దే అధినేత అమృతపాల్. గతంలో జాతీయ భద్రత చట్టం కింద అరెస్ట్ అయ్యారు. తన తొమ్మిది మంది అనుచరులతో కలిసి ఆయన అసోంలోని డిబ్రూఘర్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు.

Also Read: Hathras Event: లైంగిక వేధింపుల కేసుల్లో ‘బోలే బాబా’..!


మరోవైపు ఉగ్రవాదులకు నిధులు అందజేశారనే ఆరోపణలపై ఇంజినీర్ రషీద్‌ను గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆయన సైతం బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. రషీద్ సైతం జులై 5వ తేదీన ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు ఫరీద్‌కోట్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా సరబ్ జిత్ సింగ్ ఖల్సా విజయం సాధించారు. ఆయన కూడా అదే రోజు ఎంపీగా ప్రమాణం చేయనున్నారు.

Also Read: Viral Video: కుర్రకారు జోరు... నెటిజన్ల పోరు.. స్పందించిన ఖాకీలు


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో జూన్ 24న లోక్‌సభ ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఇంజినీర్ రషీద్‌తోపాటు అమృతపాల్ సింగ్ జైల్లో ఉన్నారు. వారిద్దరు జైల్లో ఉండి... ఈ ఎన్నికల్లో గెలిచారు. దీంతో వారు ఎంపీలుగా ప్రమాణం చేయడం అనివార్యమైంది.

Also Read: Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం


ఇక ఇంజినీర్ రషీద్.. తాను ఎంపీగా ప్రమాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎంపీగా ఆయన ప్రమాణం చేయడంపై ఏమైనా అభ్యంతరాలుంటే జులై 1వ తేదీ లోపు తెలపాలని జాతీయ భద్రత సంస్థ(ఎన్‌ఐఏ)కు కోర్టు సూచించింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. దాంతో తీహాడ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇంజినీర్ రషీద్‌కు జులై 5వ తేదీ రెండు గంటల పేరోల్‌పై విడుదల చేసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Also Read: Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 06:46 PM