Home » Maharashtra
హింసకు కారణమైన వారి నుంచి ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని, వారు డబ్బులు చెల్లించని పక్షంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయిస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
నాగపూర్ హింసాకాండ ఘటలో ఇంతవరకూ పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. నాగపూర్‌లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారంనాడు కూడా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.
నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు.
తమ గడ్డపై ఒసామాబిన్ లాడెన్‌ను పూడ్చిపెట్టేందుకు అమెరికా నిరాకరించిందని, అతని మృతదేహాన్ని సముద్రంలో గుర్తుతెలియని ప్రాంతంలో డిస్పోజ్ చేసిందని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. తద్వారా లాడెన్‌ను ఎవరూ కీర్తించకుండా అడ్డుకట్ట వేసిందని అన్నారు.
ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్స్ హింసాత్మకంగా మారడంతో నాగ్‌పూర్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు.
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్స్ నాగ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూడంతో పోలీసుల భాష్ప వాయువు ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టాల్సి వచ్చింది. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం పిలుపునిచ్చారు.
Maharashtra : ఛావా సినిమా ఎఫెక్ట్ ఔరంగజేబు సమాధిపై పడింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఔరంగజేబు సమాధికి మరాఠా గడ్డపై స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఓ ముఠా సమాధిని ధ్వంసం చేయనుందనే సమాచారం పోలీసులకు అందడంతో.
కొన్ని శక్తివంతమైన దేశాలు ప్రపంచాన్ని విధ్యంసం దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నందున భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాందేవ్ బాబా అన్నారు.
మహాయుతి ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలు సమన్వయంతో పనిచేస్తుంటాయని, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూటమి నేతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఫడ్నవిస్ తెలిపారు. ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
పునరావృద్ధి ప్రాజెక్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలని యూఏఈకి చెందిన సీలింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఈ పిటిషన్ వేసింది. తాము గతంలో వేసిన బిడ్‌ను తోసిపుచ్చి అదానీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు ధారావా ప్రాజెక్టు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సవాలు చేసింది.