Nagpur Violence: నాగపూర్ హింసాకాండ ప్రధాన సూత్రధారి అరెస్టు
ABN , Publish Date - Mar 19 , 2025 | 02:53 PM
నాగపూర్ హింసాకాండ ఘటలో ఇంతవరకూ పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. నాగపూర్‌లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారంనాడు కూడా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌లో మార్చి 17న రెండు గ్రూపుల మధ్య చెలరేగిన హింసాకాండ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హింసాకాండకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఫాహీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షాహీమ్ ఖన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో నితిన్ గడ్కరిపై పోటీ చేశారు. ఇంతవరకూ పోలీసులు 50 మందిని అరెస్టు చేయగా, నాగపూర్‌లోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా రెండవ రోజైన బుధవారంనాడు కూడా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.
Nagpur Clash Aurangzeb Tomb Row: ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ డిమాండ్స్.. నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస
కాగా, నాగపూర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని డీసీపీ రాహులవ్ మక్నికర్ తెలిపారు. 10 పోలీసు బృందాలు ఇంతవరకూ 50 మంది దుండగులను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో 19 మంది నిందితులను జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు (జేఎంఎఫ్‌సీ) రిమాండ్‌కు పంపింది.
నాగపూర్‌లో ఇటీవల జరిగిన హింసాకాండను రాష్ట్ర హోం మంత్రి యోగేష్ కదమ్ ఖండించారు. ఇది చాలా సీరియస్ అంశమని చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీసీపీ స్థాయి అధికారులు, పోలీసు సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. గత మూడు నాలుగేళ్లుగా మహారాష్ట్రలో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులపై చర్యలను తీవ్రతరం చేశామన్నారు. కాగా, ప్రజలు ప్రశాంతతను పాటించాలని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైఖ్వాడ్ కోరారు. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నం కృషి చేయాలని, వాళ్ల నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు. నాగపూర్ హింసాకాండలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ కాగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్‌సీపీ) నేత రోహిత్ పవార్ సూచించారు.
హింసాకాండ ఇలా చెలరేగింది
మొఘల్ చక్రవర్తి ఔరంగబేబ్ సమాధి తొలగించాలనే డిమాండ్ నేపథ్యంలో ఒక మతానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని తగులబెట్టారనే వదంతులు చెలరేగడంతో నాగపూర్‌లో పలు చోట్ల హింసాకాండ చెలరేగింది. హసన్‌పురి ఏరియాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు వాహనాలను, ఆస్తులకు నిప్పుపెట్టారు. ర్యాపిడ్ కంట్రోల్ ఫోర్స్ రంగంలోకి దిగి పలువురిని అదుపులోనికి తీసుకుంది. ర్యాపిడ్ కంట్రోల్ ఫోర్స్‌లోని మహిళా పోలీసు అధికారిపై అల్లరిమూక అసభ్యంగా ప్రవర్తించినట్టు ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. ఈనెల17వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు మొదలైన హింసాకాండ రాత్రి 11.30 వరకూ కొనసాగింది.
ఇవి కూడా చదవండి
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి