Devendra Fadnavis: నేను ఆ మాజీ సీఎం మాదిరి కాదు.. ఫడ్నవిస్ చురకలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:56 PM
మహాయుతి ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలు సమన్వయంతో పనిచేస్తుంటాయని, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూటమి నేతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఫడ్నవిస్ తెలిపారు. ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

ముంబై: శివసేన (UBT) ఛీప్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) చురకలు వేశారు. తాను ఉద్ధవ్ థాకరేను కాదని, ప్రస్తుతం నడుస్తున్న ఏ ప్రాజెక్టులను కూడా తాము నిలిపివేసేది లేదని చెప్పారు. గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చకు ఫడ్నవిస్ అసెంబ్లీలో శుక్రవారంనాడు సమాధానమిస్తూ, తలపెట్టిన ప్రాజెక్టులను ఆపిన ఘనత మాజీ సీఎందేనని, తాను అలాంటి సీఎంను కాదని చెప్పారు. గత మహాయుతి ప్రభుత్వంలో షిండే సీఎంగా తీసుకున్న నిర్ణయాలు ఆయన ఒక్కరే తీసుకున్న నిర్ణయాలు కావని, ఆయన, తాను, అజిత్ పవార్ సమష్టిగా తీసుకున్న నిర్ణయాలని చెప్పారు.
Supreme Court: ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు నిలిపివేతకు సుప్రీంకోర్టు 'నో'
మహాయుతి ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలు సమన్వయంతో పనిచేస్తుంటాయని, విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూటమి నేతలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఫడ్నవిస్ తెలిపారు. ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చుతూ, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా స్కీమ్ లేదని ఒక డివిజనల్ కమిషనర్ చెబితే ఆ నింద తనపై వేయడం సరికాదన్నారు.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమికి అధికారం ఇచ్చారని, వారి అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే తాము పనిచేస్తామని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్లాన్‌తో ముందుకెళ్తోందని, మంత్రాలయకు తాలూకా స్థాయి ఆఫీసుల ఏర్పాటు, ఆఫీసు రికార్డులను మెరుగుపరచడం, పీపుల్స్ ఫ్రెండ్లీ పాలన అందించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తు్న్నామని చెప్పారు. 100 రోజుల్లో ప్రతి శాఖ పనితీరును క్వాలిటీ కౌన్సిల్ ఆప్ ఇండియా అంచనా వేస్తుందని, చక్కటి ప్రతిభ కనబరచిన వారికి మే 1న సన్మానం చేస్తామని చెప్పారు. కొత్త వర్క్ కల్చర్‌ను ప్రవేశపెట్టాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.
ముంబై మెట్రో-3
దేశంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ మెట్రో లైన్‌గా తీర్దిదిద్దుతున్న ముంబై మెట్రో-3 ఈ ఏడాది జూన్ నుంచి పూర్తిస్థాయిలో నడుస్తుందని, 2027 నాటికి అన్ని మెట్రో కారిడార్లు ఓపెన్ అవుతాయని సీఎం తెలిపారు.
గుజరాత్ కంటే 3 రెట్లు పెట్టుబడులు
గుజరాత్‌లో పెట్టుబడుల ప్రవాహం అంటూ విపక్షాలు విమర్శలు చేస్తుండటాన్ని సీఎం తిప్పికొట్టారు. పొరుగు రాష్ట్రం కంటే మూడు రెట్లు అధికంగా పెట్టుబడులను మహారాష్ట్ర ఆకర్షించినట్టు చెప్పారు. గుజరాత్‌ను ప్రశంసించడం ఆపాలన్నారు. ప్రతిపాదిత 802 కిలోమీటర్ల నాగపూర్-గోవా శక్తిపీఠ్ ఎక్స్‌ప్రెస్ ప్రధానంగా మరాఠ్వాడాతో సహా 12 జిల్లాల మీదుగా వెళ్తుందని, ఇది కేవలం రోడ్డు కాదని, అభివృద్ధికి కీలక ఊతమని చెప్పారు. కొంకణ్, సౌత్ మహారాష్టర, సెంట్రల్ ఇండియా మధ్య కనెక్టివిటీని పెంచుతూ మరాఠ్వాడా ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తుందని తెలిపారు. ప్రతిపాదిత హైవేకు వార్దా, యవత్మాల్, హింగోలి, నాందేడ్, పర్భని, బీడ్, లాతూర్, ధారాశివ్, షోలాపూరప్, సాంగ్లి, కొల్హాపూర్, సింధుదుర్గ్‌లను కలుపుతుందని చెప్పారు. కొల్హాపూర్‌లో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు తాలూకాలకు చెందిన 200 మంది రైతులు గురువారంనాడు జరిపిన సమావేశంలో తమ మద్దతు ప్రకటించారని వివరించారు.
ఇవి కూడా చదవండి
Aircraft Crash: కుప్పకూలిన ఐఏఎఫ్ జాగ్వార్ విమానం
Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం
Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు
భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.