Home » Mancherial district
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాదిగ హక్కుల దండోరా (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునిల్ మాదిగ అన్నారు. ప్రెస్ క్లబ్లో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ళ రామకృష్ణతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మాదారం పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఎస్ఐ సౌజన్య విద్యార్థులకు పోలీస్‌స్టేషన్‌లో ఉండే రిసెప్షన్ వ్యవస్థ, కేసు డైరీలు, స్టేషన్లో ఉపయోగించే ఆయుధాలు, విధులు, షీటీమ్స్, సైబర్ మోసాలకు అవగాహన కల్పించారు.
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్న ప్రభుత్వ ఆశయం ఎట్టకేలకు నెరవేరేందుకు మార్గం సుగమమైంది. ఇంతకాలం నిధుల కేటాయింపుల్లో జాప్యం కారణంగా ఆ చర్యలు ముందుకు రాలేదు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టుకు తక్కువ మొత్తంలో నిధులు వెచ్చించడం ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రౌడీషీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని, లేదంటే కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తామని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. బెల్లంపల్లిలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శిం చారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలు, రికార్డులు, రిజిష్టర్లను, వార్డులను పరిశీలించారు.
జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వారిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఐబీ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తాలో మంచి మంచిర్యాల పెట్టాలని నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేశామన్నారు.
పత్తి రైతులు పరేషాన్లో పడ్డారు... సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు... ప్రైవేట్ వ్యాపారులు పెట్టిన ధరకు విక్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో పత్తి తడిస్తే తేమ పేరిట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరమని, అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
విద్యార్థుల్లో పఠన సామర్ధ్యం పెంపొందించాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం పడ్తన్‌పల్లి పాఠశాలలో రూమ్ టూ రీడ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో చదవడం అలవాటు చేయడం ద్వారా వారిని స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్టు, యుఎస్ఏఐడీ సహకారంతో ప్రతీ మండలంలో ఒక మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వచ్చే ఏడాది జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ కోరారు. నస్పూర్, తీగల్‌పహాడ్, సీతారాంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలు, కస్తూర్భా విద్యాలయంలో సోమవారం ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఉపాధ్యాయులకు అందించారు.