Home » Mancherial district
జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న దాడులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మద్యం, గంజాయి మత్తులో, పాత కక్షలు, ఆస్తి తగాదాలు, భూ పంచాయతీలపై పరస్పర దాడులు జరుగుతున్నాయి. రాజకీయంగా సైతం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వరుస సంఘటనలతో శాంతిభద్రతలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం రైతులకు నష్టం కలిగించింది. శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మండలంలోని పెద్దంపేట, గొల్లపల్లి, బుద్దిపల్లి గ్రామాల్లో వరి పంట నేలవాలింది.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం కోసం నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలన్నారు.
ప్రభావిత గ్రామాల యువతకు పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ, ఆయా గ్రామాల్లో రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సమాజంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు.
జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లలో అవినీతి దందా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తు న్నారు. అన్నీ సక్రమంగా ఉన్న వాటిలో సైతం వసూళ్ళు చేపడుతు న్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పవర్ ప్లాంట్ గెస్ట్‌హౌజ్‌లో ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామితో కలిసి అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు.
ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే మరో వైపు మహిళలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మహిళ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ మహిళలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ లాభాల బాట పడుతున్నారు.
చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం జిల్లాలో నామమాత్రంగా అమలవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. కరోనా మహమ్మారి విద్యా రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపింది.
అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందన్నారు. మండల కేంద్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ కేంద్రం, పిండి వంటలు, పచ్చళ్ల తయారీ కేంద్రం, మెడికల్ స్టోర్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.