Home » Mancherial district
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కమీషన్‌కు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అని, గడిచిన 8 నెలల్లో ఆయన ఎంత కమీషన్ తీసుకున్నాడో మా దగ్గర చిట్టా ఉందన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించడం లేదు. ఈనెల 2వ తేదీ నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.
సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధుల కల సాకారం కానుంది. వారం రోజుల క్రితం డీఎస్సీ ఫలితాలతో జిల్లా అభ్యర్ధులు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సంబంధిత జిల్లా అధికారులు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు.
జిల్లాలో షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాంలతో కలిసి సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానం వెంటనే అమలు చేయాలని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అన్నారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నర్సరీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని సోమవారం డీఆర్డీఏ పీడీ కిషన్‌కు కార్యదర్శులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు చేస్తూ పంచాయతీలను నడుపుతున్నామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నాలుగేండ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు కావడం, బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
గిరిజన సంస్కృతీ, సంప్ర దాయాలను కాపాడేది ఆదివాసి గిరిజనులేనని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్లు అన్నారు. గుడిరేవు గోదావరి నది ఒడ్డున పద్మల్‌పూరీ కాకో ఆలయంలో ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహా సంగా ప్రారంభమయ్యాయి.
మాదిగలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక హాలులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం ఎరుకల సమ స్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర సలహాదా రులు శ్రీరాములు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శ్రీని వాస్, లోకిని రాజు, రేవెల్లి రాజలింగు, రమేష్‌లు పేర్కొన్నారు. ఆదివారం చెన్నూరులో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.