Home » Mancherial district
దండేపల్లి మండలంలో గురువారం ఉరుములతో కూడిన కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మామిడిపల్లిలో వరి కోత దశలోకి రావడంతో గాలులతో కూడిన వర్షం కురవడంతో వరి పంట నేలవాలింది. వరి గింజలు నల్లబడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రైతుల వరిపంట కంకి దశలో ఉంది. నేలవాలడంతో నష్టం వాటిల్లింది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం, రాపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇతర అన్ని అంశాలపై ప్రభుత్వం చేపట్టిన సర్వేను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట మండల పరిధిలో రహదారుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శంకుస్ధాపన చేశారు.
చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సామాజిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు 108 అంబులెన్స్‌లను ప్రారంభించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) సమస్యలతో సతమతమవుతున్నాయి. అరకొర సౌకర్యాలతో అటు సిబ్బందికి, విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గాంధీ పార్కులో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు మౌన దీక్ష చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ అప్పటి జనతా ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి 1978లో బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మంగళవారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ఫీజు దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, అభినవ్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 8300 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉందని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
బాణాసంచా అమ్మకాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండ్లలో, లక్ష్మీ పూజల అనంతరం దుకాణాల్లో బాణాసంచా కాలుస్తారు. టపాసుల అమ్మకాలు, కొనుగోళ్లు, అమ్మకాలు బాగానే సాగుతాయి. దీపావళికి రెండు రోజులు ఉండగానే బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అంతా సిద్ధం చేశారు.
మంచిర్యాల మున్సిపాలిటీలో తరుచుగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వివిధ రకాల పన్నుల రూపేణ ప్రజల నుంచి వసూలు చేసిన నగదును ఉద్యోగులు సొంతానికి వాడుకోవడం ఇక్కడ షరా మామూలైంది. పెద్ద మొత్తంలో సొమ్ము మాయం అయిన విషయం ఆడిట్ సందర్భంగా వెలుగు చూడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జపటేల్లు అన్నారు. గుడిరేవులో పద్మల్‌పూరీ కాకో ఆలయంలో సోమవారం నిర్వహించిన గుస్సాడి దర్బార్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మట్లాడారు.