Home » Mancherial district
జిల్లా కోర్టుకు భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ మంగళ వారం ఒకరోజు మౌనదీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్దగల హనుమాన్ విగ్రహం వద్ద ఆయన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో సొంత ఇంటి కోసం ఎదరుచూస్తున్న నిరు పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల విష యంలో సొంత స్థలం ఉన్నవారికి మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా, లేనివారికి 75 గజాల స్థలం ఇవ్వనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తి ఎంతో విలువైందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ప్రిన్సిపాల్ దావూద్ సులేమాన్‌తో కలిసి హాజర య్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3వ బ్యాచ్ కొనసాగుతుందని, వైద్య విద్యార్థులు ఏకా గ్రతతో చదువుకుని ఉన్నత స్ధానానికి చేరుకోవాలన్నారు.
మంచిర్యాల జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు సోమవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. పాఠశా లకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ సెక్టోరియల్ అధి కారి సత్యనారాయణమూర్తి సూచించారు. వెల్గనూర్ ఉన్నత పాఠశా లను సోమవారం సందర్శించారు.
కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసిన హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతి శీల మహిళ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులతో బాధితురా లుకు న్యాయం జరగడం లేదన్నారు.
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల కబ్జా పరిపాటిగా మారింది. స్థలంలో మొదట తాత్కాలిక గుడిసెలు వేసి అదును చూసి పక్కా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పట్టణంలోని అండా ళమ్మ కాలనీలో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అండాళమ్మ కాలనీ జిల్లా కేంద్రానికి శివారులో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చోటా, మోటా నాయకులు గుట్టుచప్పుడు కాకుండా స్థలాలను చేజిక్కించుకుంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐబీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, రాజకీయ, విద్య, కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి కల్పన పేర్కొన్నారు. ఆదివారం బీసీ కాలనీలో జిల్లా పంచాయతీ అధికారి, ముదిరాజ్ కాలనీలో జరుగుతున్న సర్వేను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు.
కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 25వేల మందిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.