Home » Mancherial
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కేటాయింపుల్లో రోడ్డు, రవాణా, విద్య, వైద్యంతోపాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మన్నెగూడం క్రాస్రోడ్ నుంచి కోనంపేట మీదుగా కుశ్నపల్లి వరకు బీటీ రోడ్డు, మన్నెగూడం ప్రాథమిక పాఠశాల ప్రహారి నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు.
నస్పూర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శార్వాణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థులకు గురువు డాక్టర్ భార్గవిప్రేమ్ ఆధ్వర్యంలో గజ్జె పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అడవుల సంరక్ష ణకు కృషి చేయాలని కవ్వాల్ టైగర్ రిజర్వ్ సీఎఫ్, ఎఫ్డీపీటీ శాంతా రామ్ అన్నారు. తాని మడుగు బీట్ పరిధిలో జరుగుతున్న టేకు చెట్ల నరికివేతను జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ ఆశిశ్సింగ్, తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా ఫ్లయింగ్ స్వ్కాడ్ ఆఫీసర్ రమాదేవి కలిసి ఆదివారం పరిశీలించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అర్హత గల ఆర్ట్, క్రాఫ్ట్ అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రిక్రూట్మెంట్ జరగగా అప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాలుగా నియామకాలు జరగలేదు. డీఎస్సీ నియామకాల్లో పోస్టులు కేటాయించకపోవడంతో ఆ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్ప్రహలకు గురవుతున్నారు.
ఎస్సీ వర్గీకరణ చేస్తే నేతకానీలకు ప్రత్యేక కేటగిరి కేటాయించాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జాడి ముసలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పీఆర్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు.
విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించడమే లక్ష్యమని విద్యశాఖ అధికారులు అన్నారు. తీగల్ పహాడ్లోని మండల పరిషత్ పాఠశాలలో రూమ్టురీడ్ ఇండియా ట్రస్ట్ యుఎస్ఏఐడీ సహకారం, ఎస్ఇఆర్ఐ, ఎఫ్ఎల్ఎన్కు అనుబందంగా విద్యాశాఖ సమన్వయంతో మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు.
గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలేనని రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. గుడిరేవులోని పద్మల్పూరీ కాకో ఆలయాన్ని శనివారం సందర్శించారు. గిరిజన సంప్రదాబద్దంగా గుస్సాడీతో స్వాగతం పలికారు.
పంట చేతి కొచ్చి విక్రయించే వరకు రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సమస్యలు అలాగే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. ప్రతీ సీజన్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టార్పాలిన్లు లేకపోవడంతో అకాలవర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ఆస్నాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావుతో కలిసి సందర్శించి హాజరు పట్టికలను, తరగతి గదలు, పరిసరాలను పరిశీలించారు.
లేబర్ సైట్ను వెంటనే పునరుద్దరించాలని ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ నాయకులు బెల్లంపల్లి పట్టణంలో అడ్డా కూలీలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది పేదలు, యువకులు కూలీ పనులు చేసుకుంటున్నారని, రెండు నెలలుగా కార్మిక శాఖకు చెందిన ఆన్లైన్ సైట్ పని చేయకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.