Home » Mangalagiri
మంగళగిరి వైసీపీ ఇన్చార్జి గంజి చిరంజీవికి సెగ తగిలింది. చిరంజీవిని బాప్టిస్ట్ పేట వాసులు నిలదీశారు. పేదవారంటే ఎవరు... పెత్తందారులు అంటే ఎవరంటూ నిలదీశారు. పెత్తందారులు అయిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు సిమెంటు రోడ్లు ఎందుకు ఉన్నాయి?.. పేదవాళ్లమయిన తమ ఇంటి ముందు ఎందుకు గుంటల రోడ్లు ఉన్నాయని ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిమ్స్ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని వివరాలు తెలిపేలా ఓ ఫ్లెక్సీని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. పూర్తిగా కేంద్రం నిధులతోనే ఎయిమ్స్ నిర్మాణం చేశారని ఫ్లెక్సీలో వివరించారు. అయితే ఫ్లెక్సీ ఏర్పాటుపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి శనివారం మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించారు. మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుందని... మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా బ్రహ్మణి అన్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పవన్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కలిగించింది. దీంతో ఆయన ఆయా జిల్లాల నేతలను పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: ‘‘నిజం గెలివాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది.
Andhrapradesh: ఈ ఏడాది టీడీపీ అధికారం చేపట్టగానే అన్ని అన్నా క్యాంటీన్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్దరిస్తారని నారా భువనేశ్వరి తెలిపారు.
మంగళగిరిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓటమిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు.