AP Politics: టీడీపీ ఆఫీసుకు వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. ఎందుకంటే?
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:21 PM
మంగళగిరి(Mangalagiri)లోని టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడి కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శలు చేయడంతో ఆగ్రహించిన వైసీపీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు.
గుంటూరు: మంగళగిరి(Mangalagiri)లోని టీడీపీ కేంద్ర కార్యాలయం(TDP central office)పై 2021 అక్టోబర్ 19న వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడి కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శలు చేయడంతో ఆగ్రహించిన వైసీపీ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు, ఆఫీస్ ఆవరణలోని కార్లు ధ్వంసం చేశారు. అటు టీడీపీ నేత పట్టాభి నివాసంపై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఇంట్లోని విలువైన వస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేసి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో విచారణ మాత్రం ముందుకు సాగలేదు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లెక్కలు మారుతున్నాయి. ఈ కేసు విచారణ వేగం పుంజుకుంటోంది. దాడికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరాలు పరిశీలించారు. దాడుల్లో ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులే దాడులకు తెగపడ్డారంటూ టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. త్వరలోనే నిందుతులను గుర్తించే వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
MLA Ganta: ఇచ్చిన మాటకి కట్టుబడి రూ.4వేలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
AP Politics: ప్రజల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన చరిత్ర మీ పార్టీదే: ఎమ్మెల్యే గంటా