Home » Medak
కులాల పేరుతో ఈటల రాజేందర్ రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. గత 6 నెలల్లో బీజేపీలో సమీకరణాలు మారాయన్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ కలుషితమైందని ఆరోపించారు.
రామాయంపేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు పక్కన ధాన్యం బస్తాలతో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టింది.
దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. రోడ్డు ప్రమాదం ఆ ఇంటి చిన్నారులను మింగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్(Medak) పట్టణంలో అన్నపూర్ణ, తన ఇద్దరు పిల్లలు పృథ్వీ(12), ఫణితేజ్(10)లతో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.
టెక్నాలజీ వచ్చాక యూత్ ఆలోచనల్లో సృజనాత్మకత బయటపడుతోంది. విభిన్న ఆలోచనలతో తాము ఉన్న రంగాల్లోనే కాదు.. వ్యక్తిగత జీవితాలని కూడా వినూత్నంగా మార్చుకుంటున్నారు. వివాహాన్ని మధురానుభూతిగా మార్చుకోవాలనుకునే వారు కొత్త ఐడియాలతో వస్తున్నారు. వెడ్డింగ్ కార్డుల్ని వినూత్నంగా తయారు చేయించండం ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు వెడ్డింగ్ కార్డుని(Wedding Card) విభిన్నంగా డిజైన్ చేయించాడు.
మంత్రి హరీష్‌రావును ఢీకొనడంతో తన లక్ష్యమని సిద్దిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) ఎవరికీ భయపడదు.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జనఖర్గే ( Mallikarjun Kharge ) అన్నారు.
మెదక్ జిల్లా: తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు.
నవంబర్ 18న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో లక్షల మందితో మాదిగల విశ్వరూప మహా సభ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు.
బీఆర్ఎస్ది నీచమైన కల్చర్ అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు.