Home » Medical News
రాష్ట్రంలో వైరల్ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన రెండు నెలల్లోనే హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్ బారిన పడి ఆస్పత్రులకు వచ్చినవారి సంఖ్య 1200కు పైగానే ఉన్నట్టు సమాచారం!
విద్యార్ధుల భవిష్యత్తే తమకు అత్యంత ప్రాధాన్య అంశమని.. వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
పేషంట్లు ఆరోగ్య పరీక్షలు (డయాగ్నస్టిక్ టెస్ట్‌లు) చేయించుకున్న తర్వాత ఆ రిపోర్టుల ఆధారంగా, అవసరమైతేనే యాంటీబయాటిక్ ఔషధాలను సిఫార్సు చేయాలని .......
బోన్ మ్యారో(ఎముక మజ్జ) క్యాన్సర్ చికిత్సకు ఇకపై రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు..! ఆస్పత్రికి రాగానే.. చికిత్స చేయించుకుని, ఆ వెంటనే ఇంటికి వెళ్లొచ్చు.
నాణ్యమైన వైద్య విద్యను అందించడమే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా ప్రైవేటు కాలేజీలపై హెల్త్ యూనివర్సిటీ పర్యవేక్షణ ఉండగా.. ఇక నుంచి సర్కారే పర్యవేక్షించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
నీట్ పరీక్ష ర్యాంకింగ్‌లు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో అబాసుపాలై.. సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) తాజాగా మరో అపవాదును మూటగట్టుకుంది.
నీట్ అక్రమాలపై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఆ పరీక్ష నిర్వహణలో మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. పేపర్ లీకేజీలతో అన్యాయానికి గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (21న) అన్ని రాష్ట్రాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.
నీట్ పరీక్షల వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో కీలక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఏ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణలో విస్తృత మార్పులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో నకిలీ, నాసిరకం ఔషధాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉత్తుత్తి మందులను అమ్ముతూ కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికారులు చేస్తున్న దాడుల్లో నకిలీ మందుల ముఠాలు భారీగా బయటపడుతున్నాయి.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీహెచ్ పరిధిలోని 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.