Home » Medical News
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లిన మందులు నిల్వ ఉంటున్నాయి. వైద్య సిబ్బంది అలాంటి ఔషధాలను సకాలంలో గుర్తించి వెనక్కి పంపడం లేదు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది.
వైద్యవిద్య అకడమిక్ సంచాలకుడు డాక్టర్ శివరాంప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడం.. రోగుల ప్రాణం మీదకు వస్తోంది.
సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, సిబ్బంది బదిలీలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు.
గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
టీటీడీ నిర్వహణలో ఉన్న శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ (స్విమ్స్) డైరెక్టర్‌గా ఎవరు రాబోతున్నారు అనే చర్చ వైద్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ పదవీకాలం రెండేళ్లపాటు ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో ఈయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాని నాలుగు కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది.
అసలే వ్యాధులు ప్రబలే సీజన్. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్ల వంటివి విజృంభిస్తున్న సమయం. పెద్దాస్పత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి. వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం.