Home » Mumbai Indians
ఐపీఎల్ 2024(ipl 2024) కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ తమ జట్లలో చేరడం ప్రారంభించారు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా(hardik pandya) ఈసారి ముంబై ఇండియన్స్‌కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాకు సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూం పూజ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి బ్యాట్ చేతపట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ సెషన్లో ముమ్మర కసరత్తులు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) తొలి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించడం విశేషం.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంపై క్రీడాభిమానులు ఎంతలా మండిపడ్డారో అందరికీ తెలుసు. ఆ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్స్ సాధించిపెట్టిన రోహిత్‌ని ఎందుకు సారథిగా పక్కకు తప్పించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కావడం ఖాయమైపోయింది.
తానొక స్టార్ క్రికెటర్ని అని, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి లగ్జరీ హోటళ్లను మోసం చేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెజ్‌తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ రూ.5.5 లక్షల మోసం చేశాడు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే పలు రకాల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారడం పెద్ద చర్చనీయాంశం అయింది.
IPL 2024: గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన హార్దిక్ పాండ్య ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆప్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు వచ్చే ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కనిపిస్తాడని చర్చించుకుంటున్నారు.
Mumbai Indians: రోహిత్ కెప్టెన్సీపై ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తాము రోహిత్‌కు చెప్పే కెప్టెన్సీ నుంచి తొలగించామని.. అతడి గురించి అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించింది. హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడానికి ముందు కూడా తమ ఆటగాళ్ల అభిప్రాయం తీసుకున్నామని వివరించింది.
IPL 2024 action: ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. తొలిసారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుండడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈ వేలాన్ని కూడా నిర్వహించనున్నారు.