WPL 2024: ఉత్కంఠ మ్యాచులో లాస్ట్ బంతికి సిక్స్.. థ్రిల్లింగ్ విక్టరీ
ABN , Publish Date - Feb 24 , 2024 | 06:44 AM
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) తొలి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించడం విశేషం.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024(WPL 2024) తొలి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతికి విజయం సాధించడం విశేషం. ముంబై జట్టు విజయానికి చివరి బంతికి 5 పరుగులు కావాలి. ఆ క్రమంలోనే సజీవన్ సజన(sajeevan sajana) సిక్సర్ కొట్టి తన జట్టును గెలిపించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై(delhi capitals) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లిష్ ప్లేయర్ ఎలిస్ క్యాప్సీ హాఫ్ సెంచరీతో 75 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున తొలుత అద్భుతంగా ఆడి ఐదు వికెట్లకు 171 పరుగులు చేసింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కష్టాలు దాటుకొని.
ఇక ముంబై ఇండియన్స్(mumbai indians) ఆరంభంలోనే హేలీ మాథ్యూస్ ఖాతా తెరవకుండానే తొలి ఓవర్‌లోనే ఔటైంది. దీని తర్వాత యస్తిక భాటియా, నేట్ సివర్ బ్రంట్ మధ్య రెండవ వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. పవర్‌ప్లేలో ముంబై 50 పరుగులు మాత్రమే చేసింది. బ్రంట్ ఇన్నింగ్స్ 19 పరుగుల వద్ద అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో ఔటైంది. దీని తర్వాత యాస్తికకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌన్ సపోర్ట్ ఇచ్చింది. దీంతో యాస్టికా భాటియా అర్ధ సెంచరీ పూర్తి చేసి ముంబై స్కోరును 100 దాటేసింది.
14వ ఓవర్‌లో యాస్తిక ఔట్ అయ్యేసరికి జట్టు స్కోరు 106 పరుగులు. హర్మన్‌ప్రీత్ కౌర్(harman preet kaur) 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసింది. నాలుగో బంతికి ఫోర్ కొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆలిస్ క్యాప్సీ బంతికి ఔటైంది. ఆ తర్వాత అమేలియా కెర్ 24 రన్స్, నెక్ట్స్ వచ్చిన పూజా వస్త్రకార్క్ 3 బంతుల్లో ఒక పరుగు తీయగా.. అమంజోత్ కౌర్ రెండు బంతుల్లో 3 పరుగులు రాబట్టింది. దీంతో చివరి బంతికి 5 రన్స్ కావాల్సి ఉండగా సజన సిక్స్ కొట్టి జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించింది.