Share News

IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..? కారణం ఇదే..!!

ABN , Publish Date - Dec 23 , 2023 | 02:32 PM

IPL 2024: గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన హార్దిక్ పాండ్య ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆప్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు వచ్చే ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కనిపిస్తాడని చర్చించుకుంటున్నారు.

IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..? కారణం ఇదే..!!

ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన హార్దిక్ పాండ్యకు అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించడం రోహిత్ శర్మ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని వాళ్లు తీవ్రస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్య ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన అతడు మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీమిండియా ఆడిన సిరీస్‌లలో కూడా హార్దిక్ కనిపించలేదు.

కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో హార్దిక్ పాండ్య ఇంకా కోలుకోలేదని.. ఈ నేపథ్యంలో అతడు ఆప్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు వచ్చే ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కనిపిస్తాడని చర్చించుకుంటున్నారు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వెంటనే టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఒకవేళ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌కు దూరమైతే టీమిండియా సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్య చేపట్టనున్నాడు. కాగా ఐపీఎల్‌లో పాండ్య గైర్హాజరుపై ముంబై ఇండియన్స్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనించాల్సిన విషయం.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 23 , 2023 | 02:32 PM