Home » Mumbai
లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు ముంబైలో ఆదివారంనాడు పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్లోకి వెళ్తుండగా ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారు లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందని వారని సమాచారం. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
ముంబైలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ నిన్న రాత్రి హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.
ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.
మనల్ని ఎవరైనా అవమానిస్తే.. దెబ్బకు దెబ్బ తీసే వరకు నిద్రపోం. అందుకు సమయం కోసం వేచి చూస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు రెట్టింపు వేగంతో మనల్ని అవమానించిన వారిని దెబ్బ కొట్టేస్తాం. కానీ ఓ సారి టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటాకు అవమానం జరిగింది. కానీ ఆయన ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించలేదు. ఆపదలో ఉన్నప్పుడు వారికి సాయం అందించారు.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు.
మహారాష్ట్రలో షెడ్యూల్ తెగల (ఎస్టీ) క్యాటగిరీలో ధన్‌గఢ్ సామాజిక వర్గాన్ని చేర్చాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో.. అధికార వర్గం ప్రజాప్రతినిధుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీలో బయటకు వచ్చిన గోవిందా తాను కోలుకోవాలని ప్రార్థించిన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిలుచుని ఫోటోలు దిగారు.
వెబ్లే కంపెనీకి చెందిన తుపాకీ పేలడంతో బుల్లెట్ ఎడమకాలి మోకాలు కింద తగిలిందని, అది చాలా పాత తుపాకీ అని, లాక్ చేయకపోవడంతో మిస్‌ఫైర్ అయిందని గోవింద తెలిపారు.
కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి 'ఫ్రై' చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను ముంబై హైకోర్టు మంగళవారంనాడు ధ్రువీకరించింది.