Share News

Mumbai: పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం

ABN , Publish Date - Oct 13 , 2024 | 05:38 PM

లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు ముంబైలో ఆదివారంనాడు పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు.

Mumbai: పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. పశ్చిమ రైల్వే సేవలకు అంతరాయం

ముంబై: లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు ముంబై (Mumbai)లో ఆదివారంనాడు పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. రైలు ఖాళీగా ఉండటంతో ఈ ఘటనలో గాయపడిన సమాచారం ఏదీ అందలేదని వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి వినీత్ అభిషేక్ తెలిపారు. బోగీలు పట్టాలు తప్పడంతో సబర్బన్ సేవలకు అంతరాయ కలిగిందన్నారు.

Uddhav Thackeray: సీఎం అభ్యర్థి ఎవరో ముందు వాళ్లను తేల్చుకోనీయండి


కాగా, ఈ ఘటన అనంతరం చర్చిగేట్, ముంబై సెంట్రల్ మధ్య 'స్లో ట్రాక్'పై రాకపోకలు నిలిపేశారు. రెండు స్టేషన్ల మధ్య రైళ్లను ఫాస్ట్ లైన్‌కు మళ్లించారు. లోకల్ రైల్ బోగాలు తప్పడంతో పెద్దఎత్తున ప్రయాణికులు ఇబ్బందులకు గరయ్యారు. వెంటనే లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టనట్టు అధికారులు తెలిపారు. రైలు బోగాలు పట్టాలు తప్పడంపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.


దీనికి ముందు, గత శుక్రవారం రాత్రి త‌మిళ‌నాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువ‌ళ్లూరు స‌మీపంలోని కావ‌రిపెట్టై వ‌ద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ప‌లువురు ప్రయాణికులు గాయపడ్డారు.


Read More National News and Latest Telugu News

ఈ వార్తలు కూడా చదవండి:

Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు

Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?

Updated Date - Oct 13 , 2024 | 05:38 PM