Share News

Ratan Tata: రతన్ టాటాకి ఘోర అవమానం..

ABN , Publish Date - Oct 10 , 2024 | 04:38 PM

మనల్ని ఎవరైనా అవమానిస్తే.. దెబ్బకు దెబ్బ తీసే వరకు నిద్రపోం. అందుకు సమయం కోసం వేచి చూస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు రెట్టింపు వేగంతో మనల్ని అవమానించిన వారిని దెబ్బ కొట్టేస్తాం. కానీ ఓ సారి టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటాకు అవమానం జరిగింది. కానీ ఆయన ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించలేదు. ఆపదలో ఉన్నప్పుడు వారికి సాయం అందించారు.

Ratan Tata: రతన్ టాటాకి ఘోర అవమానం..

మనల్ని ఎవరైనా అవమానిస్తే.. దెబ్బకు దెబ్బ తీసే వరకు నిద్రపోం. అందుకు సమయం కోసం వేచి చూస్తాం. ఆ సమయం వచ్చినప్పుడు రెట్టింపు వేగంతో మనల్ని అవమానించిన వారిని దెబ్బ కొట్టేస్తాం. కానీ ఓ సారి టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటాకు అవమానం జరిగింది. కానీ ఆయన ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించలేదు. ఆపదలో ఉన్నప్పుడు వారికి సాయం అందించారు. వారిని కష్టాల నుంచి రక్షించారు. రతన్ టాటా బుధవారం మరణించిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ఈ సందర్భంగా చర్చించుకుంటున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

సాల్ట్ నుంచి స్టీల్ వరకు ఉత్పత్తి చేసే టాటా సంస్థ 1990 దశకం చివరలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌తో నడిచే టాటా ఇండికాను మార్కెట్‌లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఆ దిశగా అడుగులు వేసి.. ఇండికా కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది. కానీ ఈ కారు.. అనుకున్నంతంగా ప్రజలు ఆదరించ లేదు. దీంతో ఈ కార్ల విక్రయాలు ఊపందుకోలేదు. దాంతో ఏడాదికే కార్ల తయారీ పరిశ్రమను విక్రయించాలని రతన్ టాటా నిర్ణయించారు.

ఆ క్రమంలో ఈ కార్ల పరిశ్రమను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఫోర్డు కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో బొంబాయి హౌస్‌లో పోర్డు కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్‌తో రతన్ టాటాతో టాటా సంస్థకు చెందిన పలువురు సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోర్డు కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ మాట్లాడుతూ.. ఏమీ తెలియకుండా కార్ల పరిశ్రమను ఎందుకు ప్రారంభించారంటూ ప్రశ్నించారు. అసలు ఊహించని ఈ ప్రశ్నకు రతన్ టాటా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సమావేశం అనంతరం రతన్ టాటా తీవ్ర అవమానం జరిగినట్లుగా భావించారు.


ఈ నేపథ్యంలో కార్ల పరిశ్రమను విక్రయించాలన్న ఆలోచనను ఆయన విరమించుకున్నారు. అనంతరం కార్ల పరిశ్రమను అభివృద్ధి పరిచే విధంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక కొన్నేళ్లకు మంద్యం దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిపోయింది. ఆ దెబ్బకు ఫోర్డ్ కంపెనీ సైతం దివాలా తీసింది. దీంతో ఈ సంస్థను విక్రయించాలని ఆ సంస్థ చైర్మన్ బిల్ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.


ఈ కార్ల పరిశ్రమను కొనుగోలు చేసేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది. అలా 2.3 బిలియన్ డాలర్లతో జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను టాటా సంస్థ సొంతం చేసుకుంది. దీంతో ఫోర్డ్ కంపెనీ యజమాని బిల్ ఫోర్డ్ సైతం.. రతన్ టాటాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాలను 2015లో రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు ప్రవీణ్ కండ్లే ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ రెండు సమయాల్లో రతన్ టాటా పక్కనే తాను ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాగ్వర్, ల్యాండ్ రోవర్ కార్లు విక్రయాలతో టాటా సంస్థకు భారీగా లాభాలు తెచ్చిపడుతున్న సంగతి తెలిసిందే.

For National News and Telugu News...

Updated Date - Oct 10 , 2024 | 09:20 PM