Home » National News
ఇరుదేశాలు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నాయని, కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ త్వరలోనే మొదలవుతుందని, ఇందుకోసం గ్రౌండ్ కమాండర్ల చర్చలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గురువారం దీపావళి సందర్భంగా ఇరువర్గాలు మిఠాయిలు పంచుకుంటాయని వెల్లడించారు.
అయోధ్య పురవీధుల్లో లక్షలాది జనవాహిన మధ్య రామలక్షణ వేషధారులు రథంపై ఊరేగగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రథం లాగి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. లేజర్ షోలు, డ్రోన్ షోలు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అయోధ్య మారుమోగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ మహారాష్ట్ర, విదర్బ, ముంబై-కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, మరాఠ్వాడాల్లో 8 పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొనే బాధ్యత దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరి, చంద్రశేఖర్ బవాంకులేకి అప్పగించారు.
ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.
హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్ను ఘనంగా నిర్వహించనుంది.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. నీలం రంగు దుస్తులు ధరించిన ఓ యువతి తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా కేకు ముందు నిలుచుని ఉంది. ఆమె చుట్టూ చాలా మంది వ్యక్తులు నిలుచుని ఉన్నారు. కేకు మధ్యలో ఓ వృత్తాకారపు రింగు అమర్చి ఉంది.
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 దంపతులు బెంగళూరు విచ్చేశారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు వారు బెంగళూరులోనే ఉన్నారు. అయితే వీరి పర్యటన చాలా టాప్ సీక్రెట్‌గా జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
ఇది హిందూ, ముస్లింలకు సంబంధించిన అంశంకాదని, పండుగ ప్రధాన స్ఫూర్తి దీపకాంతులను వెదజల్లడమే కానీ, పొగను వ్యాపింపజేయడం కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాలుష్యం విషయానికి వచ్చినప్పుడు సంప్రదాయం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అంటే నిన్నటితో ముగిసింది. బుధవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరించుకునే గడువు నవంబర్ 4వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో.. నవంబర్ 20వ తేదీన జరగనుంది.
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 30వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసీఏఐ వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి లాగిన్ కావాల్సి ఉందని వివరించింది. ఈ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించిన విషయం విధితమే.