Home » NEET PG Exam
వాయిదా పడ్డ నీట్-పీజీ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్టు ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎ్స)’ శుక్రవారం ప్రకటించింది.
నీట్- 2024 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థుల అవగాహన కోసం నీట్-2023 సీట్ అలాట్మెంట్ బుక్లెట్ను సిద్ధం చేసినట్లు కోటా పేజెస్ సంస్థ తెలిపింది.
నీట్ యూజీ 2024 పరీక్షను(NEET UG 2024) పూర్తిగా రద్దు చేయడం వల్ల పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయతీపరులకు అన్యాయం జరుగుతుందని.. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై(NEET Paper Leakage) సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐని ఆదేశించినట్లు చెప్పింది.
పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను ప్రకటించారు. శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ కొత్త తేదీలను ప్రకటించింది.
వైద్య విద్యా కోర్సులు చదవాలని ఆకాంక్షించే గ్రామీణ విద్యార్థులకు తీరని నష్టం కలిగించే నీట్ రద్దు చేయాల్సిందేనని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్(Movie actor Vijay) డిమాండ్ చేశారు.
నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. నీట్ యూజీ అంశంపై 3వ తేదీ (బుధవారం) ప్రత్యేక చర్చ నిర్వహించాలని కోరారు. ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్చ పెట్టాలి. ఆ చర్చలో పాల్గొనడం సభ్యుల కర్తవ్యం. చర్చకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని’ లేఖలో రాహుల్ గాంధీ కోరారు.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
నీట్-యూజీని పెన్ను-పేపరు విధానానికి బదులు ఇక ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.