NEET PG Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీలు విడుదల
ABN , Publish Date - Jul 05 , 2024 | 03:23 PM
పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను ప్రకటించారు. శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ కొత్త తేదీలను ప్రకటించింది.
ఢిల్లీ: పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీలను ప్రకటించారు. శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ తేదీలను ప్రకటించింది.
ఆగస్టు 11 న నీట్ పీజీ నిర్వహిస్తారు. ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) గత ఏడు సంవత్సరాలుగా NEET-PG పరీక్షను జరుపుతోంది. నీట్ పరీక్ష పత్రం లీకేజ్ కారణంగా జూన్ 23న నీట్ పీజీ పరీక్షను రద్దు చేశారు. రద్దైన రెండు వారాల తరువాత కొత్త షెడ్యూల్‌ని ప్రకటించారు.
నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజీపై పెద్ద రాద్ధాంతమే జరుగుతుండగా కేంద్ర విద్యాశాఖ గత నెలలో జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను రద్దు చేసింది. తాజాగా పరీక్ష తేదీలపై క్లారిటీ ఇచ్చింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు కోసం ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి విచారిస్తోంది. పలువురు అరెస్ట్ అయ్యారు.
For Latest News and National News click here