Home » New Delhi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.
జార్ఖండ్‌లో కాకలు తిరిగిన గిరిజన నేతగా పేరున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం సీనియర్ నేత చంపయీ సోరెన్ హస్తినలో ఆదివారంనాడు అడుగుపెట్టడం వెనుక కారణం ఏమిటనే సస్పెన్స్ కొనసాగుతోంది.మీడియా అడిగిన రెండు ప్రధాన ప్రశ్నలకు సూటి సమాధానం దాటవేశారు.
భారతదేశ 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 140 కోట్ల ప్రజానీకం ఎంతో సంబరంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతోందని అన్నారు.
మంగళవారం న్యూఢిల్లీ, పశ్చిమ వినోద్ నగర్‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి మనీశ్ సిసోడియా సందర్శించారు. ఈ సందర్బంగా వారికి పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టారు. విద్యార్ధులతో వారిద్దరు కొద్ది సేపు ముచ్చటించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే అనిశ్చితి ఓవైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం (GAD) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని తెలిపింది.
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనానికి ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి బీజేపీ నేత జగదంబికా పాల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
దేశ రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు నిబంధనావళిని తిరిగి రూపొందించి, నేర బాధ్యులను గుర్తించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్‌ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్‌సింగ్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.
ఆనారోగ్యంతో భర్త మరణించాడు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడితో కలిసి నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గడ్‌లో ఆ తల్లి నివసిస్తుంది. అయితే ఆగస్ట్ 3వ తేదీన.. తన ఇంట్లో చెవి దిద్దులు, బంగారపు ఉంగరంతోపాటు రెండు చైన్లు కనిపించకుండా పోయాయి. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.