Home » Nitish Kumar
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.
హిందూ పండుగలకు సెలవులను తగ్గిస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతిస్తోందని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. bjp alleges cm nitish government might implement shariat law in bihar soon as holidays for hindu festivals for schools curtailed
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్‌సభ పోల్స్ జరగవచ్చని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. ఎన్నికలు ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఒరిజినల్ షెడ్యూల్‌కే ఎన్నికలు జరుగుతాయనే గ్యారెంటీ ఏమీ లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
ముంబైలో ఈనెల 31, సెప్టెంబర్ 1న జరగనున్న ప్రతిపక్షాల ''ఇండియా'' కూటమి సమావేశంలో లోగో ఎంపికతో పాటు సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్ ఎన్నిక కీలకం కాబోతున్నాయి. కూటమి కన్వీనర్‌గా బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ నియమితులయ్యే అవకాశాలున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తాను ఏదీ కావాలని అనుకోవడం లేదన్నారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..
ప్రముఖ హిందీ దినపత్రికలో పని చేస్తున్న పాత్రికేయుడు విమల్ కుమార్ శుక్రవారం ఉదయం దారుణంగా హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు.
దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. బీహార్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నితీష్ అక్కడి నుంచి అటల్ సమాధి స్థల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో తన అనుబంధాన్ని, ఆయన తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు (Patna High Court)లో భారీ ఊరట లభించింది. కుల ప్రాతిపదికన (caste-based) సర్వే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను మంగళవారం తోసిపుచ్చింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా తిరిగి ఎన్డీఏలోకి వస్తారంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ తోసిపుచ్చారు. ఆయన రావాలనుకున్నా బీజేపీ అందుకు సిద్ధంగా లేదని చెప్పారు.