Nitish Kumar: అటల్‌జీ అభిమానం చూరగొన్నా: నితీష్
ABN , First Publish Date - 2023-08-16T16:15:05+05:30 IST
దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్దంతి సందర్భంగా ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. బీహార్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నితీష్ అక్కడి నుంచి అటల్ సమాధి స్థల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో తన అనుబంధాన్ని, ఆయన తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.
న్యూఢిల్లీ: దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) వర్దంతి సందర్భంగా ఆయనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) బుధవారంనాడు ఘనంగా నివాళులర్పించారు. బీహార్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న నితీష్ అక్కడి నుంచి అటల్ సమాధి స్థల్‌కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయితో తన అనుబంధాన్ని, ఆయన తన పట్ల చూపించిన అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు.
''అటల్‌జీ నాకు ఎన్నో పనులు అప్పగించేవారు, ఎంతగానే అభిమానం చూపేవారు. నేను బీహార్‌కు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వాజ్‌పేయి కేంద్రంలో ఉన్నారు'' అని నితీష్ ఓ ట్వీట్‌లో తెలిపారు.
దీనికి ముందు, సదైవ్ అటైల్ మెమోరియల్ వద్ద దివంగత ప్రధానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌కఢ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు మంత్రులు, ఎన్డీయే నేతలు నివాళులర్పించారు. భారతదేశ ప్రగతి, 21వ శతాబ్దంలో దేశాన్ని వివిధ రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లే విషయంలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారని, 140 కోట్ల ప్రజానీకంతో పాటు తాను సైతం అటల్‌జీకి నివాళులర్పిస్తు్న్నారని మోదీ తెలిపారు.