Home » NRI Latest News
విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ హోటల్లో.. సర్వర్‌గా, వెయిటర్‌గా పని చేసేందుకు భారతీయులు భారీగా క్యూ కట్టారు. ఈ ఘటన కెనడాలో బ్రాంప్టన్‌లోని తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్ వద్ద చోటు చేసుకుంది. సదరు రెస్టారెంట్లో సర్వర్, వెయిటర్ ఉద్యోగాల కోసం.. దాదాపు 3 వేల మంది విద్యార్థులు క్యూ కట్టారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న ఎంతో కన్నుల పండువగా జరిగాయి.
కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ నిర్వహించేందుకు స్థానిక తెలుగు ఎన్నారైలు సిద్ధమయ్యారు. అక్టోబర్ 6న వైభంగా దసరా, బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు గ్లాస్గో తెలుగు సాంస్కృతిక సంఘం ప్రతినిధులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రప్రథమంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన ఒక బాధితున్ని ముఖ్యమంత్రి కలుసుకున్నారు. సౌదీ అరేబియా కువైత్ దేశాల సరిహద్దు ఎడారుల్లో ఒంటెల కాపరిగా పని చేస్తూ, నరకయాతన అనుభవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో..
కెనడాలో ఉంటున్న ఓ భారతీయుడిని ఇంటి ఓనర్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాల షాకైపోతున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం అక్టోబరు మొదటి తేదీ మంగళవారం సాయంత్రం న్యూజెర్సీలోని సాయి దత్తపీఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యవాణి ప్రసంగించారు.
వీసా నిబంధనల కారణంగా సౌదీలో చిక్కుకుపోయిన ఇద్దరు తెలుగు ప్రవాసీయులు తమ సంతానం కన్నుమూసినా ఇండియాకు రాలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
కువైత్‌లోని ఓ అరబ్బు యాజమాని ఇంట్లో టీ చేసే ఉద్యోమంటూ తీసుకెళ్లి.. సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా మార్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే గిరిజనుడిని ఎట్టకేలకు ఇద్దరు ప్రవాసీ వాలంటీర్లు రక్షించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.