Home » Parliament
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే సర్కార్ తొలి బడ్జెట్ మంగళవారం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు విలువైన సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు.
కన్వర్ యాత్ర, నీట్, మణిపుర్ సహా పలు వివాదాస్పద అంశాల మధ్య సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాష్ట్రాలు, రెండు మిత్రపక్షాలు(టీడీపీ, జేడీయూ) తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయి. వీటన్నింటి నడుమ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు(సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో బిల్లుల జాబితాను విడుదల చేశారు.
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్‌గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్‌లను నియమించింది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఇండియా కూటమి సత్తా చాటింది. 7 రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో పది సీట్లను కూటమి గెలుచుకుంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముంగిట ప్రత్యేక హోదాపై బిహార్లో అధికార ఎన్డీయే, విపక్ష మహాకూటమి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
మణిపూర్‌లో శాంతి స్థాపన అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో బలంగా మాట్లాడతామని కాంగ్రెస్, ఇండియా కూటమి తరఫున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.