Delhi: అఖిలపక్ష సమావేశం నేడు..
ABN , Publish Date - Jul 21 , 2024 | 08:48 AM
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు (Parliament Monsoon Budget Sessions) సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం (All Party Meeting) జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల (Political Parties Floor Leaders)తో ఈ భేటీ జరుగుతుంది. జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కాగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు (సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం, విశ్లేషణలతోపాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది.
మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకైన కేసు, రైల్వే భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలలో 90 ఏళ్ల నాటి పౌర విమానయాన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
కాగా సభాధ్యక్షుడు ఇచ్చే రూలింగ్‌లను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ, సభలోగానీ, బయటగానీ విమర్శించకూడదని పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఎంపీలకు స్పష్టం చేశారు. అలాగే, సభలో వందేమాతరం, జైహింద్ సహా నినాదాలేమీ చేయకూడదని తేల్చిచెప్పారు. సభలో ప్లకార్డులు తదితరాలు ప్రదర్శించడమూ పద్ధతి కాదంటూ.. పార్లమెంటరీ ఆచారాలు, సాంప్రదాయాలు, ఎథిక్స్‌పై సభ్యులు దృష్టిపెట్టేలా ‘రాజ్యసభ సభ్యుల కోసం హేండ్ బుక్’ను రాజ్యసభ సెక్రటేరియట్ తీసుకొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News