Hyderabad: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:24 AM
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. లగచర్ల దాడి ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును పట్నం నరేందర్ రెడ్డి ఆశ్రయించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లగచర్ల దాడి ఘటనలో తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును పట్నం నరేందర్ రెడ్డి ఆశ్రయించారు. అయితే మాజీ ఎమ్మెల్యే వేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది. కాగా, క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నరేందర్ రెడ్డి బెయిల్ విషయాన్ని పరిశీలించి తీర్పు చెప్పాలని జిల్లా కోర్టును ఆదేశించింది. కాగా, లగచర్ల దాడి ఘటనలో అరస్టయిన నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని ఏ-1గా గుర్తించిన అధికారులు గత నెల ఆయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.