Share News

Hyderabad: మళ్లీ చర్లపల్లి జైలుకు పట్నం నరేందర్‌రెడ్డి

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:27 AM

కస్టడీ ముగియడంతో లగచర్ల ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సోమవారం పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.

Hyderabad: మళ్లీ చర్లపల్లి జైలుకు పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కస్టడీ ముగియడంతో లగచర్ల ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని సోమవారం పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. తొలుత కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరు పరిచి, అనంతరం జైలుకు తీసుకెళ్లారు. లగచర్లలో భూసేకరణ విషయమై అభిప్రాయాలు తెలుసుకోవడానికి వెళ్లిన అధికార్లపై దాడులు చేశారంటూ 71 మందిపై కేసులు నమోదయ్యాయి.


దీని వెనుక కుట్ర ఉందనే కోణంలో పట్నం నరేందర్‌రెడ్డిని ప్రథమ నిందితుడు (ఏ1)గా పేర్కొని కేసు పెట్టారు. అయితే, ఆ దాడితో తనకు సంబంధం లేదని విచారణలో ఆయన సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. చివరగా కోర్టులో హాజరుపర్చగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన న్యాయాధికారికి చెప్పారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి కొడంగల్‌ కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 10 , 2024 | 03:27 AM