Home » Ponnam Prabhakar
తిరుమల తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో సైతం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎ్సలు కుమ్ముక్కవడం వల్లనే కవితకు బెయిల్ సాధ్యపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వనివారు.. తాము ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటూ ధర్నాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చెరువురు ఆక్రమణలకు గురయ్యామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముందుగా రాజధాని నగరం హైదరాబాద్లో, ఆ తర్వాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని తిరిగి చెరువులుగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
Telangana: ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ను , టీ షర్ట్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని, పెండింగ్లో ఉన్న రూ.200 కోట్ల ఆర్పీఎస్ బాండ్ డబ్బులను త్వరలో సిబ్బందికి అందించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాల్లో రైతులు ఎవరు పాల్గొన లేదన్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఉనికి కోసమే ధర్నాలు చేపట్టిందంటూ బిఆర్ఎస్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలకు ప్రజల నుంచి స్పందనే లేదన్నారు. అందుకే ఒక్క రోజు చేసి ఢిల్లీకి ప్రయాణమవుతున్నారని తెలిపారు.
అదానీ అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.