Home » Ponnam Prabhakar
మురికికూపంగా మారిన మూసీని అభివృద్ధి చేసి పూర్వవైభవం తేవాలని చూస్తుంటే కొన్ని శక్తులు విషప్రచారాలు చేస్తున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని వాస్తవ విమర్శ చేయాలని అన్నారు..లేకపోతే పర్యవసానం తప్పదని హెచ్చరించారు. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు తాన అంటే తందాన అంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
రాష్ట్రంలోని బీసీ గురుకులాలు, హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు, సౌకర్యాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై 15 రోజులకోసారి పురోగతి నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
Telangana: మొదటిసారి వినాయకుడి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. 360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు జనం బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తలేదని.. ఇంకా అదే అహంకారాన్ని చూపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనుంది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి.
గల్ఫ్‌లో ఉన్న వారి కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజా వాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.